తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీలో నిత్యావసరాల పంపిణీ - food items distributed at boduppal municipality region

బోడుప్పల్‌ నగర పాలక సంస్థ పరిధిలో కాలనీ సంక్షేమ సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో సమీప బస్తీ వాసులకు నిత్యాసర సరకులు పంపిణీ చేశారు.

food items distributions poor people in boduppal municipality hyderabad
బస్తీలో నిత్యావసరాల పంపిణీ

By

Published : May 3, 2020, 6:10 PM IST

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో కాలనీ సంక్షేమ సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో ఎస్సీ బస్తీలో సుమారు 150 మందికి నిత్యావసర సరకులు అందజేశారు. కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు సాయం చేయాలని ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు సమాఖ్య ఛైర్మన్ రాపోలు రాములు అన్నారు.

లాక్​డౌన్ ప్రారంభం నుండి ప్రతి రోజు వివిధ కాలనీలలో తిరుగుతు పేదలకు చేయూత అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, కాల్కురి రాములు, చిత్తరాంజన్, పంగా రమేష్, నర్సింగరావు, రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'కరోనా వ్యాప్తి నియంత్రణలో భారత్‌ భేష్‌'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details