DSC Candidates Meet Bandi Sanjay: డీఎస్సీ-2008 మెరిట్ అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పిస్తూ నియామకాలు జరపాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా, కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అభ్యర్థులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎదుట వాపోయారు. పలువురు అభ్యర్థులు బీజేపీ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం అందజేశారు.
'డీఎస్సీ మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలిస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకోవట్లేదు'
DSC Candidates Meet Bandi Sanjay: డీఎస్సీ మెరిట్ అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పిస్తూ నియామకాలు జరపాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా గానీ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అభ్యర్థులు బండి సంజయ్ ఎదుట వాపోయారు. ఈ మేరకు పలువురు అభ్యర్థులు బీజేపీ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం అందజేశారు. డీఎస్సీ-2008 మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలిస్తామని సీఎం కేసీఆర్ 2016లో హామీ ఇచ్చారని, 6 ఏళ్లు దాటినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
DSC Candidates Submitted Petition at BJP Office: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేసి నియామక ప్రక్రియ చేపట్టినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ-2008 మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ 2016లో హామీ ఇచ్చారని, 6 ఏళ్లు దాటినా పట్టించుకోవడం లేదన్నారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ డీఎస్సీ-2008 మెరిట్ అభ్యర్థుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా ఒత్తిడి తెస్తానని చెప్పారు.
ఇవీ చదవండి: