తెలంగాణ

telangana

ETV Bharat / state

బ్రాహ్మణులకు భాజపా ఆపన్నహస్తం... సరుకుల పంపిణీ

హైదరాబాద్ శేరిలింగంపల్లిలో నియోజకవర్గ పరిధి భాజపా ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణులకు కిరాణా వస్తువులు అందించారు. లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి చేయుతనివ్వాలనే ఉద్దేశంతోనే పంపిణీ చేశామని భాజపా నేత జ్ఞానేంద్ర ప్రసాద్ తెలిపారు.

పేద బ్రాహ్మణులకు సరుకుల పంపిణీ
పేద బ్రాహ్మణులకు సరుకుల పంపిణీ

By

Published : May 3, 2020, 6:32 PM IST

హైదరాబాద్ నగర శివారు శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్రాహ్మణులకు భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అపన్నహస్తం అందించారు. హాఫీజ్‌పేట్ డివిజన్‌ శ్రీసాయిరాం టవర్స్‌ వద్ద పేద బ్రాహ్మణులు, కిన్నర సమాజ్‌ సభ్యులు, నాయీబ్రాహ్మణ సభ్యులకు శ్రీ సాయిరాం టవర్స్ సభ్యులు సంజయ్ సహకారంతో 300 మంది కుటుంబాలకు కిరాణా సామగ్రి పంపిణీ చేశారు.

వీహెచ్​పీ ఆధ్వర్యంలో...

వీహెచ్‌పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాఘవల్‌ జీ బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు అందించారు. కార్యక్రమంలో అసోషియేషన్ సభ్యులు, వివేకానంద సేవా సమితి సభ్యులు తదితరులు సహకరించారు.

ఇవీ చూడండి : లాక్​డౌన్​ 3.0లో ఏం చేయొచ్చు? ఏం చేయరాదు?

ABOUT THE AUTHOR

...view details