కరోనా లక్షణాలతో ఉప తహసీల్దారు మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా రాయచోటిలో చోటుచేసుకొంది. మదనపల్లి రోడ్డులోని వెంకటేశ్వర వీధిలో నివాసముండే సుదర్శన్ తీవ్ర జ్వరం, శ్వాస లేని స్థితిలో ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంటకు మృతి చెందారు.
కరోనా లక్షణాలతో ఉప తహసీల్దార్ మృతి
కరోనా లక్షణాలతో ఉప తహసీల్దారు మృతి చెందిన ఘటన కడప జిల్లా రాయచోటిలో చోటుచేసుకొంది.
కరోనా లక్షణాలతో ఆ ప్రాంత ఉప తహసీల్దార్ మృతి
కోమా స్థితిలో ఉన్న అతన్ని పురపాలక సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. కాపాడేందుకు వైద్యులు విశ్వప్రయత్నం చేశారు. మృతుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా వైద్యులు భావిస్తున్నారు. భార్య, ఇద్దరు కుమార్తెలు గల సుదర్శన్ రాజంపేట ఉప తహసీల్దార్‌గా పని చేస్తున్నారు. పురపాలక కమిషనర్ రాంబాబు మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఇదీ చూడండి:అనారోగ్యంతో దేవినేని సీతారామయ్య కన్నుమూత