డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్.. మంచి నీటి సరఫరా, సివరేజి వ్యవస్థ నిర్వహణపై జల మండలి అధికారులతో సమీక్షించారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 20 వేల లీటర్లలోపు ఉచిత మంచి నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఉచిత నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయండి: పద్మారావు గౌడ్ - హైదరాబాద్ తాజా వార్తలు
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 20 వేల లీటర్లలోపు ఉచిత మంచి నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. మంచి నీటి సరఫరా, సివరేజి వ్యవస్థ నిర్వహణపై జల మండలి అధికారులతో సమీక్షించారు.

ఉచిత నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయండి: పద్మారావు గౌడ్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నగరంలో 20 వేల లీటర్ల ఉచిత మంచి నీరు సరఫరాకు కేటీఆర్ ఆదేశించారని... ఈ క్రమంలో సికింద్రాబాద్ పరిధిలో కూడా ఏర్పాట్లు ముమ్మరం చేయాలన్నారు. సివరేజి లైన్ల పునర్నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జల మండలి జనరల్ మేనేజర్ రమణా రెడ్డి, డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోతుల కిష్కిందకాండ