విశాఖ భీమిలిలో మృతదేహం బైక్పై తరలింపు - Dead Body Travel By two Wheeler in bheemunipatnam
కరోనా నేపథ్యంలో మృతదేహాన్ని తరలించే నాథుడే కరువయ్యాడు. చేసేదేమీ లేక ద్విచక్రవాహనంపై ఇద్దరు యువకులు మహిళ మృతదేహాన్ని మధ్యలో కూర్చోబెట్టి ఆసుపత్రి నుంచి ఇంటికి తరలించిన హృదయవిదారక ఘటన ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లాలో జరిగింది.
ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ పరిధిలో నేరెళ్ల వలస కాలనీకి చెందిన 40 ఏళ్ల వియ్యపు రామయ్యమ్మ... కొద్ది కాలంగా గుండె నొప్పి, ఆయాసంతో బాధ పడుతోంది. చికిత్స నిమిత్తం ఆమెను 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్థానిక ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఆటోలో తరలించారు. రామయ్యమ్మను ఆసుపత్రి వద్ద దించిన వెంటనే ఆటో వెళ్లిపోయింది. ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని ధ్రువీకరించారు. మృతదేహాన్ని తరలించేందుకు వాహనం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో స్థానిక యువకుల సహకారంతో ద్విచక్రవాహనంపైనే తరలించాల్సి వచ్చింది.