దాదాసాహెబ్ పాల్కే 150 జయంతి ఉత్సవాలు తొలిసారిగా హైదరాబాద్ నగరంలో జరగనున్నాయి. ఈనెల 20న హైదరాబాద్ మాదాపూర్ ఎన్ కన్వెన్ష్ సెంటర్లో దక్షిణ భారత విభాగానికి సంబంధించిన దాదాసాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆధ్వర్యంలో అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అవార్డుల విశేషాలను తెలియజేశారు. ఈ కార్యక్రమం మన దగ్గర జరగడం ఆనందగా ఉందని సినీ నటుడు కౌశల్ అన్నారు. ఇప్పటివరకు తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఏడుగురికి అవార్డులు రావడం గర్వంగా ఉందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సినీ కథానాయిక అవంతిక మిశ్రా, సినీ నటులు సంపూర్ణేష్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రదానోత్సవం
దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ విభాగానికి సంబంధించి ఈనెల 20న తొలిసారిగా హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్‌కన్వెన్షన్‌లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆధ్వర్యంలో అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్‌లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రదానోత్సవం