4.20PM
తీరం దాటిన తుపాను
తీరం దాటిన తీవ్ర తుపాను మిగ్‌జాం. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల సమీపంలో తీవ్ర తుపాను తీరం దాటింది. తీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల 2 గంటల్లో తుపానుగా మిగ్‌జాం బలహీనపడనున్నది. అనంతరం 6 గంటల్లో వాయుగుండంగా బలహీనపడనున్నది. తుపాను తీరం దాటినా సరే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
04.05 PM
జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి టెలీకాన్ఫరెన్స్
ఎడతెరపిలేని వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తర, దక్షణ తెలంగాణా జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, పరిస్థితులపై ఆరా తీశారు. టెలికాన్ఫరెన్స్లో విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబబాద్, సూర్యాపేట తదితర జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
నేడు, రేపు రెండు రోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి సూచించారు. భారీ వర్షాలు, వరదలు వచ్చిన సందర్భంలో పాటించాల్సిన ప్రొటొకాల్స్కు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలన్నారు.
నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కాజ్-వే, లోతట్టు ప్రాంతాల వద్ద తగు జాగ్రత చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలని శాంతి కుమారి అధికారులను సూచించారు.
01.38 PM
రాష్ట్రంలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు : వాతావరణ శాఖ
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అతిభారీ నుంచి- అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుండి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, నల్గొండ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని తెలిపింది. బుధవారం పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది.
01.11 PM
వర్షంలో తడుచుకుంటు స్వామివారిని దర్శించుకున్న భక్తులు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గము వ్యాప్తంగా పలు మండలాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. యాదాద్రి ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులు తడుస్తూనే స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి చలిగాలుల తీవ్రత పెరిగింది. తుఫాను ప్రభావంతో రోడ్లపై జనజీవనం స్తంభించింది. వాతావరణంలోని మార్పుల కారణంగా వాతావరణం చల్లగా మారింది.
12.51 PM
18 విమాన సర్వీసులు రద్దు
తుపాను ప్రభావంతో రాజమండ్రి విమానాశ్రయంలో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. విమానాశ్రయం నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లే 18 సర్వీసులు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.
12.39 PM
తుపాను ఎఫెక్ట్- పలు రైళ్లు రద్దు