దేశంలోనే అత్యాధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో నేర నియంత్రణ పద్ధతులను అమలుచేస్తున్నా.. హైదరాబాద్‌లో ఏటా నేరాలు పెరుగుతున్నాయని ఎన్సీఆర్బీ వెల్లడించింది. మహిళలు, యువతులు, పిల్లలను రక్షించేందుకు షీ టీమ్స్ నిరంతరం కృషిచేస్తున్నా.. హింసాత్మక ఘటనలు తగ్గడం లేదని స్పష్టం చేసింది.
నేర నియంత్రణ పద్ధతులు అమలవుతున్నా.. తగ్గని నేరాలు - NCRB REPORT 2020
దేశంలోని మెట్రో నగరాల్లో నేరాలు నానాటికీ పెరుగుతున్నాయని జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. జాతీయ స్థాయిలో నేరాలు, నియంత్రణ పద్ధతుల గణాంకాలను.. సంస్థ ఏటా విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా 2019లో జరిగిన నేరాల తీరును వివరించింది.

నేర నియంత్రణ పద్ధతులు అమలవుతున్నా.. తగ్గని నేరాలు
మూడేళ్ల వ్యవధిలోనే సైబర్ నేరాలు నాలుగు రెట్లు పెరిగాయని పేర్కొంది. ఈ కేసుల్లో నిందితులను అరెస్టు చేస్తున్నా.. కోర్టుల్లో విచారణ కొనసాగుతోందని తెలిపింది.
- మెట్రో నగరాల్లో నేరాలు
నగరం | 2018 | 2019 | |
1 | దిల్లీ | 2,25,977 | 2,94,653 |
2 | కోల్‌కతా | 40,757 | 40,684 |
3 | చెన్నై | 19,682 | 19,682 |
4 | బెంగళూరు | 30,792 | 27,251 |
5 | హైదరాబాద్ | 14,332 | 15,333 |
- మెట్రో నగరాల్లో మహిళలపై హింస
నగరం | 2018 | 2019 | |
1 | దిల్లీ | 11,724 | 12,902 |
2 | ముంబాయి | 6,058 | 6,519 |
3 | కోల్‌కతా | 2,176 | 2,176 |
4 | బెంగళూరు | 3,427 | 3,486 |
5 | హైదరాబాద్ | 2,332 | 2,755 |
- మెట్రో నగరాల్లో సైబర్ నేరాలు
నగరం | 2018 | 2019 | |
దిల్లీ | 107 | - | |
ముంబాయి | 2,527 | - | |
కోల్‌కతా | 32 | - | |
చెన్నై | 118 | - | |
బెంగళూరు | 10,555 | - | |
హైదరాబాద్ | 1,379 | 1,793 |
- హైదరాబాద్‌లో మాత్రం 2019లో సైబర్ నేరాల గణాంకాలు నమోదయ్యాయి. మిగతా మెట్రో నగరాల్లో గణాంకాలు నమోదు కాలేదు.