తెలంగాణ

telangana

ETV Bharat / state

పోరాట యోధుల జీవితాలు నేటి తరానికి స్ఫూర్తి - ఎరుపు రంగు చొక్కాలు

హైదరాబాద్​లోని ట్యాంక్​బండ్​పై సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ముగ్దూం మోహియుద్దీన్​ విగ్రహానికి నివాళులర్పించారు.

Cpi_Red_Shirt_Activists_Rally_at_tankbund

By

Published : Sep 11, 2019, 4:53 PM IST

సాయుధపోరాట యోధులకు విప్లవాభివందనాలు...

తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్​లో సీపీఐ ర్యాలీ నిర్వహించింది. ట్యాంక్​బండ్​పై ఉన్న ముగ్దూం​ మోహియుద్దీన్ విగ్రహం ముందు సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఎరుపు రంగు చొక్కాలు ధరించి నివాళులర్పించారు. నైజాం నిరంకుషత్వ పాలన నుంచి విముక్తి కోసం సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన వీరులు రావి నారాయణరెడ్డి, ముగ్దూం మోహియుద్దీన్, బద్దం ఎల్లారెడ్డికి విప్లవాభివందనాలు చేశారు. సీపీఐ చేసిన సాయుధ పోరాటం ఫలితంగానే నాటి నిజాం నిరంకుశ పాలన రద్దయిందని నేతలు తెలిపారు. పోరాట యోధుల జీవితాలు నేటితరానికి స్ఫూర్తని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details