తెలంగాణ

telangana

ETV Bharat / state

sajjanar: కొవిడ్​ మూడో వేవ్ గురించి జాగ్రత్తలపై సీపీ బుక్​లెట్​ విడుదల

కొవిడ్​ మూడో వేవ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై​ కొండాపూర్ మెడికవర్ ఆస్పత్రి రూపొందించిన బుక్​లెట్​ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ రిలీజ్​ చేశారు.

Kondapur Medicare Hospital
sajjanar: కొవిడ్​ మూడో వేవ్ గురించి జాగ్రత్తలపై సీపీ బుక్​లేట్​ విడుదల

By

Published : Jun 2, 2021, 5:39 PM IST

కరోనా మూడో వేవ్​ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొండాపూర్ మెడికవర్ ఆస్పత్రి రూపొందించిన బుక్​లెట్​ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ విడుదల చేశారు. మూడో వేవ్​లో కరోనా ఎలాంటి వ్యక్తులపై ప్రభావం చూపుతుంది, పిల్లలను కొవిడ్ బారిన పడకుండా ఎలా రక్షించుకోవాలి, కరోనా వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే పలు రకాల అంశాలను క్లుప్తంగా ఈ బుక్​లేట్​లో పొందుపరిచారు.

మూడో వేవ్​లో అత్యధికంగా చిన్న పిల్లలు కరోనా బారిన పడే అవకాశం ఎక్కువ అని అన్ని సర్వేలు తెలుపుతున్నందున… అందరం అత్యంత జాగ్రత్త వహించాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అత్యంత శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో మెడికవర్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ, సీనియర్ వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కొవిడ్​ ఆస్పత్రికి 30 ఆక్సిజన్ సిలిండర్లు అందించిన మాజీ మంత్రి

ABOUT THE AUTHOR

...view details