తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒకే ఇంట్లో యువతీ, యువకుడు.. ఇద్దరికీ కరోనా​

గాంధీనగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఒకే ఇంట్లో నివసిస్తున్న యువతి, యువకుడు ఇటీవల కరోనా బారినపడ్డారు. యువకుడు సివిల్​ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమవుతుండగా.. ఆమె ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్నారు. లాక్​డౌన్​ కారణంగా శిక్షణ సంస్థలు మూతపడటం వల్ల వీరిద్దరూ ఇంట్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో వీరికి వైరస్​ ఎలా సోకి ఉంటుందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

corona Virus for teenagers staying in the same house inhyderabad
ఒకే ఇంట్లో ఉంటున్న యువతీ యువకునికి వైరస్​

By

Published : May 5, 2020, 9:51 AM IST

కరోనా ఊహకందని రీతిలో విస్తరిస్తోంది. హైదరాబాద్​ గాంధీనగర్‌ ఠాణా పరిధిలో ఒకే ఇంట్లో నివసిస్తున్న యువతి, యువకుడు ఇటీవల వైరస్‌ బారినపడ్డారు. అతడు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సన్నద్ధమవుతుండగా, ఆమె ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం యువకుడికి దగ్గు, జలుబు రావడం వల్ల గాంధీ ఆసుపత్రికి వెళ్లాడు. అతడి నమూనాలు పరీక్షించగా, శనివారం పాజిటివ్‌ అని ఫలితం వచ్చింది. అదేరోజు యువతికి కూడా పరీక్షలు చేయగా, ఆమెకూ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

మూలాలపై పోలీసుల ఆరా..

లాక్‌డౌన్‌ కారణంగా శిక్షణ సంస్థలు మూతపడడం వల్ల వీరిద్దరూ ఇంట్లోనే ఉంటున్నారు. నిత్యావసర వస్తువులు కొనేందుకు మాత్రమే యువకుడు బయటకు వెళ్లి వస్తున్నాడు. వారుంటున్న ఇంటికి సమీపంలోనే కూరగాయలు, పాలబూత్‌ ఉన్నాయి. రెండు రోజులకోసారి పాలు, కూరగాయలకు వెళ్లేవాడని పోలీసు విచారణలో తేలడం వల్ల కూరగాయల వ్యాపారిని, పాలబూత్‌ నిర్వాహకుడిని ప్రశ్నించారు.

ఓ రోజు ఏటీఎం కేంద్రంలో ఒక వ్యక్తికి డబ్బు డ్రా చేయడంలో సహాయం చేశానని ఆ యువకుడు చెప్పడం వల్ల ఆ వ్యక్తిని కూడా గుర్తించి వైద్యపరీక్షలు చేయించగా, నెగెటివ్‌ వచ్చింది. ఫలితంగా ఇద్దరికీ వైరస్‌ ఎలా సోకిందో ఆధారం లభించలేదు. మూలాన్ని గుర్తించేందుకు మధ్య మండలం పోలీసులు పరిశోధన చేస్తున్నారు. యువతీ యువకులు నివసించే ఇంటి యజమానులను, ఆమె వద్ద ట్యూషన్‌ చెప్పించుకునే పదేళ్ల బాలికను స్వీయ నిర్బంధంలో ఉంచారు.

ఇవీ చూడండి: ఉత్కంఠ వీడేనా? లాక్​డౌన్​పై మంగళవారం మంత్రివర్గ భేటీ

ABOUT THE AUTHOR

...view details