తెలంగాణ

telangana

ETV Bharat / state

రద్దు చేసుకుంటే డబ్బులు ఇస్తామన్నారు... అనంతరం బెదిరించారు..

రోజురోజుకు నయాపంథాలో మోసాలు జరుగుతున్నాయి. ఆన్​లైన్​లో కరోనా డిస్​ఇన్​ఫెక్టెడ్​ ఉత్పత్తులను ఆర్డర్​ ఇచ్చిన ఓ వ్యాపారిని ఓ సంస్థ మోసం చేసింది. దీంతో ఆ వ్యాపారి హైదరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులను ఆశ్రయించాడు.

corona product cheating case in hyderabad
రద్దు చేసుకుంటే డబ్బులు ఇస్తామన్నారు... అనంతరం బెదిరించారు..

By

Published : Aug 25, 2020, 8:15 PM IST

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్​రోడ్డుకు చెందిన రాజ శ్రీనివాస్ కరోనా డిస్ఇన్​ఫెక్టెడ్ ఉత్పత్తులు అమ్ముతుంటారు. ట్రేడ్ ఇండియా డాట్ కామ్ సైట్​లో కరోనా డిస్ఇన్​ఫెక్టెడ్ ఉత్పత్తుల పేరిట ఉన్న ఓ సంస్థకు ఫోన్ ద్వారా ఆర్డర్ ఇచ్చారు. అడ్వాన్స్​గా 13వేలు, ఆనంతరం 54వేలు చెల్లించారు. ఆర్డర్ రాకపోవడం వల్ల కంపెనీని సంప్రదించగా... రద్దు చేసుకుంటే డబ్బులు ఇస్తామన్నారు.

అలాగే చేయగా... ఆర్డర్ మీరే రద్దు చేసుకున్నారు. కాబట్టి డబ్బులు ఇవ్వమని, మాపై ఒత్తిడి తీసుకొస్తే మీపైనే కేసు పెడతామని బెదిరించారు. దీంతో బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు.. యువతి బలవన్మరణం

ABOUT THE AUTHOR

...view details