తెలంగాణ

telangana

ETV Bharat / state

నేషనల్ పోలీస్ అకాడమీలో కరోనా కలకలం - కొవిడ్-19 కలకలం

కరోనా మహమ్మారి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి చేరింది. ఇటీవల క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లి వచ్చిన శిక్షణ ఐపీఎస్ అధికారుల్లో ఇద్దరికీ పాజిటివ్​గా అధికారులు తేల్చారు.

నేషనల్ పోలీస్ అకాడమీలో కరోనా కలకలం
నేషనల్ పోలీస్ అకాడమీలో కరోనా కలకలం

By

Published : Jun 10, 2020, 6:53 AM IST

హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో కొవిడ్-19 కలకలం రేగింది. ఐపీఎస్ శిక్షణలో భాగంగా క్షేత్ర స్థాయిలో విధి నిర్వహణకు వెళ్లిన 137 శిక్షణార్థులు ఇటీవలే అకాడమీకి తిరిగివచ్చారు.

ఉన్నతాధికారుల ఆరా..

వారందర్నీ అకాడమీలోని క్వారంటైన్​లో ఉంచి పరీక్షలు నిర్వహించారు. అందులో ఇద్దరికీ కొవిడ్-19 పాజిటివ్​గా నిర్థరణ అయ్యింది. బాధితులు క్షేత్ర స్థాయిలో ఎవరెవరిని కలిశారనే అంశాన్ని ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

ఇవీ చూడండి : 'అంతర్రాష్ట్ర సర్వీసులపై ఒప్పందం.. సిటీ బస్సులకు నో'

ABOUT THE AUTHOR

...view details