తెలంగాణ

telangana

ETV Bharat / state

నాలుగో రోజుకు చేరిన వీహెచ్‌ ఆమరణ నిరాహార దీక్ష

పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత హన్మంతరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. పోలీసులు దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

congress-senior-leader-v-hanumantha-rao-amarana-nirahara-deeksha-reached-fourth-day
నాలుగో రోజుకు చేరిన వీహెచ్‌ ఆమరణ నిరాహార దీక్ష

By

Published : Apr 15, 2021, 2:25 PM IST

కాంగ్రెస్‌ సీనియర్ నేత వి.హన్మంతరావు ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరింది. ఆరోగ్యం క్షీణిస్తుండడంతో దీక్ష విరమింప చేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా పోలీసులు కూడా దీక్ష విరమించాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు దీక్ష విరమించేందిలేదని వీహెచ్‌ భీష్మించుకు కూర్చున్నారు.

నిన్న రాత్రి పోలీసులు దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నం చేయడంతో ఇంటి గేట్‌కు తాళాలు వేసుకుని వీహెచ్‌ దీక్ష కొనసాగిస్తున్నారు. పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని పునర్‌ ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ అంబర్‌పేటలోని తన నివాసంలో వీహెచ్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

ఇదీ చూడండి:పోలింగ్​కు ముందు కాంగ్రెస్​ అభ్యర్థి మృతి

ABOUT THE AUTHOR

...view details