Congress MLA Ticket Application Last Date :ఎన్నికలప్రచారంలో కాంగ్రెస్ జోరు పెంచింది. ముదిరాజ్‌లకు ఒక్కసీటు బీఆర్‌ఎస్ కేటాయించలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy) తప్పుబట్టారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడలో ఏర్పాటు చేసిన పరిగి నియోజకవర్గ సన్నాహక సమావేశానికి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈనెల 26న చేవెళ్ల లో నిర్వహించనున్న దళిత గిరిజన డిక్లరేషన్ ప్రజా గర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. మాదిగ బిడ్డలకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదంటూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
Congress MLA Ticket Application Telangana :అసెంబ్లీ నియోజకవర్గాల వారీగాఅభ్యర్ధుల బలాబలాలపై నివేదికలు ఇవ్వాలని పార్లమెంట్ నియోజక వర్గాల పరిశీలకులను... ముఖ్య పరిశీలకులు ఆదేశించారు. ఇందిరా భవన్‌లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్‌రావుఠాక్రే.. ముఖ్య పరిశీలకులు దీపాదాస్ మున్సీ, మీనాక్షి నటరాజన్‌లు, ఏఐసీసీ ఇంఛార్జీ కార్యదర్శులు.. పరిశీలకులతో సమావేశమయ్యారు. ఇప్పటికే కొందరు క్షేత్రస్థాయికి వెళ్లగా చాలామంది పరిశీలకులు క్షేత్రస్థాయికి వెళ్లలేదు. తక్షణమే పరిశీలకులు అంతా నియోజక వర్గాలకు వెళ్లి రెండు, మూడు రోజులు అక్కడే మకాం వేసి.. అభ్యర్థులుగా ఎవరైతే అధికార పార్టీపై విజయం సాధించేందుకు అవకాశం ఉంటుందో నివేదికలు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
Telangana Assembly Elections 2023 :కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటివరకు సుమారు 700 దరఖాస్తులు రాగా నేడు చివర రోజు అయినందున పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు అంచనావేస్తున్నాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క తదితరులు దరఖాస్తులు నేడు సమర్పించనున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్ యాదవ్, జగదీష్, ఖైలాస్, జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి.. మల్‌రెడ్డి రామిరెడ్డి సహా పలువురు అర్జీలు సమర్పించారు. రేవంత్‌రెడ్డి తరఫున కొడంగల్ నేతలు పెద్ద సంఖ్యలో గాంధీభవన్ వచ్చి అర్జీ అందించారు. జనగాం నుంచి పొన్నాలకి మద్దతుగా అనుచరులు గాంధీభవన్ తరలి వచ్చారు.