హుజూరాబాద్ ఉపఎన్నికలో (huzurabad by election) ఓటమిపై పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కె.సి.వేణుగోపాల్ (kc venugopal) అధ్యక్షతన శనివారం దిల్లీలోని వార్‌రూంలో సమీక్ష నిర్వహించారు ( congress leaders meeting in Delhi). పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (revanth reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (batti vikramarka), ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, పీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వి.హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, మాజీ మంత్రులు దామోదర రాజనరసింహా, షబ్బీర్‌అలీ, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాస్కీ, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, హుజూరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బల్మూరి వెంకట్‌లు పాల్గొన్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం... హుజూరాబాద్ ఉప ఎన్నికలకు తెరాస, భాజపా అభ్యర్థులు ముందుగా సిద్ధమవడం, అభ్యర్థిలో ఎంపికలో ఆలస్యం, 1983 నుంచి కాంగ్రెస్ గెలవకపోవడం, ధన ప్రభావం, అన్నింటికి మించి ఈటల రాజేందర్‌ను (etela rajendar) పార్టీలోకి తీసుకువచ్చే విషయంలో సకాలంలో స్పందించకపోవడం వంటి కారణాలను రేవంత్‌రెడ్డి (tpcc president revanth reddy) వివరించారు. ఈటలను పార్టీలో చేర్చుకోవడాన్ని కొందరు వ్యతిరేకించారంటూ భట్టి విక్రమార్క చెప్పబోతుండగా కె.సి.వేణుగోపాల్ అడ్డుకున్నారు. ఈటల చేరికను వ్యతిరేకిస్తూ మీరు నాతో మాట్లాడిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. మీరు తప్పు చేసి ఇతరులపై నెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈటలను చేర్చుకునే విషయంలో తాత్సారం, నిర్లక్ష్యం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.
మాటల యుద్ధం
ఈ దశలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ (ponnam prabhakar) జోక్యం చేసుకుని ‘హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమిపై సమీక్ష నిర్వహించడం సరైందే. అయితే హుజూర్‌నగర్, దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, నాగార్జునసాగర్ (Nagarjuna sagar by election) ఫలితాలపై ఎందుకు సమీక్ష నిర్వహించలేద’ని ప్రశ్నించారు. ఈ ఉపఎన్నిక ఫలితాలకు, ప్రస్తుత రాష్ట్ర నాయకత్వానికి ఎటువంటి సంబంధం లేదని, ఏడేళ్లుగా నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిగా ఉన్న కౌశిక్‌రెడ్డికి నాటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (uttam kumar reddy) ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ (rahul gandhi) రాష్ట్రానికి వచ్చినప్పుడు సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు వేరే పార్టీలో ఉండడానికి కారకులెవరో అందరికీ తెలుసన్నారు. నాడు నియోజకవర్గంలో పరిస్థితిని తాను వివరించినా మౌనంగా ఉండాలని ఉత్తమ్ చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విమర్శలకు ఆగ్రహించిన ఉత్తమ్ పరుష పదజాలం ఉపయోగించడంతో పొన్నం అందుకు దీటుగా బదులిచ్చారు. ఫలితంగా ఒక్కసారిగా వార్ రూంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కె.సి.వేణుగోపాల్, మాణికం ఠాగూర్‌లు శాంతింపజేశారు.
వార్ రూంలో ఉదయం నాయకులతో సమావేశమైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కె.సి.వేణుగోపాల్ సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో విడివిడిగా సమావేశమయ్యారు. అనంతరం నాయకులు విలేకరులతో మాట్లాడారు...
క్షేత్రస్థాయి నివేదిక తీసుకుంటాం