తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో పోలీస్​ రాజ్యం నడుస్తోంది: కాంగ్రెస్​ - rtc bandhu in telangana

ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చిన బంద్​లో​ పాల్గొని అరెస్టైన భట్టి విక్రమార్క, శ్రీధర్​ బాబు, అంజన్‌కుమార్ యాదవ్ కంచన్​బాగ్​ పోలీస్​ స్టేషన్​ నుంచి విడదలయ్యారు. రాష్ట్రంలో పోలీస్​ రాజ్యం నడుస్తోందని వారు ఆరోపించారు.

కాంగ్రెస్​ నేతలు

By

Published : Oct 19, 2019, 6:52 PM IST

ప్రశాంతంగా బంద్​ చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్​ చేయడం దారుణమన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క . ముఖ్యమంత్రి ప్రజలను అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆక్షేపించారు. ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు వెంకట్‌ను పోలీసులు కొట్టడాన్ని ఖండించారు. ఆర్టీసీ ఉద్యమంలో ఇద్దరు కార్మికులు చనిపోయినా.. సీఎంలో చలనం లేదని మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ విమర్శించారు. ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చిన బంద్​లో​ పాల్గొని అరెస్టైన వీరు కంచన్​బాగ్​ పోలీస్​ స్టేషన్​ నుంచి విడుదలయ్యారు.

రాష్ట్రంలో పోలీస్​ రాజ్యం: కాంగ్రెస్​

ABOUT THE AUTHOR

...view details