తెలంగాణ

telangana

ETV Bharat / state

విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి ​

ఆంధ్రప్రదేశ్​ విశాఖలోని గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

cm kcr-responded-on-vishaka-incident
విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి ​

By

Published : May 7, 2020, 10:34 AM IST

Updated : May 7, 2020, 3:18 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ గ్యాస్ లీకేజీ ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని దురదృష్టకర సంఘటనగా సీఎం పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కేటీఆర్​ సైతం..

విశాఖ ఘటనపై మంత్రి కేటీఆర్​ సైతం స్పందించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దామన్నారు. ఇది ఎంతో భయంకరమైన సంవత్సరమని మంత్రి వ్యాఖ్యానించారు.

త్వరగా కోలుకోవాలి..

ఘటనపై మంత్రి హరీశ్​రావు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.

ఇదీచూడండి: కరోనా ఒక్కరికొచ్చినా... వారంతా బాధితులే..!

Last Updated : May 7, 2020, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details