హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో అత్యాధునిక సౌకర్యాలతో పాస్తా-రస్తా కేఫ్ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్‌తో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు. యాంత్రిక జీవనంలో ఉరుకులు పరుగులు తీస్తున్న నగరవాసుల అభిరుచులకు అనుగుణంగా ఉందని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. ఇటలీ, చైనీస్, థాయ్, మెక్సికన్‌తో పాటు భారతీయ వంటకాలను అందించనున్నట్లు రెస్టారెంట్ ఎండీ లిఖిత్ తెలిపారు. ఇక్కడ కేవలం విందు మాత్రమే కాకుండ వచ్చిన వారికి వినోదం అందించేందుకు చక్కటి సంగీతం ఉంటుందన్నారు.
అభిరుచులకు అనుగుణంగా రెస్టారెంట్
పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నగరంలోని ఓ కేఫ్ రెస్టారెంట్‌లో సందడి చేశారు. పలు రకాల వంటకాలను రుచి చుశారు. ఉరుకులు పరుగుల జీవనంలో నూతన అనూభూతి పొందవచ్చని కితాబునిచ్చారు.
అభిరుచులకు అనుగుణంగా రెస్టారెంట్