ఆర్టీసీ, ప్రజారవాణాపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష - kcr news

11:33 November 26
ఆర్టీసీ, ప్రజారవాణాపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
ఆర్టీసీ సమస్యకు ముగింపు పలికే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికుల అంశంతో పాటు ఇతర అంశాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏం చేస్తే బాగుంటుందన్న విషయమై అధికారులతో సీఎం చర్చించారు.
సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన కార్మికులు విధుల్లో చేరేందుకు ఇవాళ చాలా మంది డిపోల వద్దకు వచ్చారు. ఈ పరిస్థితుల్లో కార్మికుల విషయమై ప్రభుత్వం, ఆర్టీసీ అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ప్రైవేటు బస్సులకు కూడా తదుపరి ప్రక్రియ చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. వీటన్నింటి ఆధారంగా శుక్రవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఇవీ చూడండి:ప్రభుత్వ తీరును ఖండించిన ఆర్టీసీ జేఏసీ