కూకట్ పల్లి ఆల్విన్ కాలనీలో నివాసముండే పశుళ్ల మహేందర్ బీపీ తక్కువ అవడం వల్ల స్థానిక మైత్రి క్లీనిక్‌కు వైద్యం నిమిత్తం వెళ్లారు. పరిశీలించిన డా.సురేష్ కుమార్ మందులు వాడాలని, ఈసీజీ తీయాలంటూ... ఆసుపత్రిలో చేరాల్సిందిగా సూచించాడు. గడువు ముగిసిన మందులు మహేందర్‌కు ఇచ్చి వేసుకోమని వైద్యుడు చెప్పాడు. సమీపంలోనే బాధితుడి ఇల్లు ఉన్నందున ఆసుపత్రిలో చేరలేదు. భోజనం అనంతరం మహేందర్ మందులను అందించాల్సిందిగా తన పిల్లలకు తెలుపగా మందులు అందించే క్రమంలో తన కొడుకు గోకుల్ మందుల తేదీ ముగిసిందని స్పష్టం చేశాడు.
గడువు ముగిసిన మందులిచ్చిన వైద్యుడిపై కేసు
వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. కానీ కొందరు వైద్యులు ఆ వృత్తికే కళంకం తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. గడువు ముగిసిన మందులు ఇచ్చి రోగులను మోసం చేస్తూ అడ్డంగా దొరికాడో ప్రబుద్ధ వైద్యుడు.
గడువు ముగిసిన మందులు ఇచ్చిన ప్రబుద్ధ వైద్యుడు
ఇలాంటి తప్పు పునరావృతం కాకూడదు
ఆస్పత్రికి వెళ్లి డాక్టర్‌ను నిలదీయగా పరవాలేదు వేసుకోవాలని చెప్పినట్లు బాధితుడు ఆరోపించారు. తేదీ ముగిసిన మందులను ఎలా వేసుకోవాలంటూ కుటుంబ సభ్యులు వైద్యుడ్ని నిలదీశారు. అనంతరం బాధితులు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సంఘటనలు మరొకరికి రాకుండా సురేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Last Updated : Jul 28, 2019, 8:23 PM IST