తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: మంత్రులు

telangana cabinet sub committee meet about karona virus
telangana cabinet sub committee meet about karona virus

By

Published : Mar 3, 2020, 10:40 AM IST

Updated : Mar 3, 2020, 12:50 PM IST

07:19 March 03

కొవిడ్-19 నియంత్రణపై సమన్వయ సమావేశం

కొవిడ్-19 నియంత్రణపై సమన్వయ సమావేశం

కొవిడ్​-19 వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ సమావేశం. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో వైద్య, ఆరోగ్య, పురపాలక, పంచాయతీరాజ్  శాఖాధిపతులతోపాటు ఇతర అధికారులతో మంత్రులు ఈటల రాజేందర్, కేటీరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్ సోమేశ్​ కుమార్ సమావేశమయ్యారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలు, అనుమానితులకు పరీక్షలు, ముందు జాగ్రత్త చర్యలు, ప్రజల్లో అవగాహన కల్పించడం సహా పలు అంశాలపై సమావేశంలో చర్చించారు.

                  కొవిడ్​-19 విషయంలో  ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రులు కేటీఆర్​, ఈటల రాజేందర్​, ఎర్రబెల్లి దయాకర్​ రావు పేర్కొన్నారు. వైరస్​ నియంత్రణకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారి సహాయార్థం ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలని మంత్రుల సూచించారు. 24 గంటల పాటు పూర్తి స్థాయిలో నడిచేలా కాల్ సెంటర్ ఏర్పాటుతో పాటు  ప్రస్తుతం ఉన్న కాల్ సెంటర్ సామర్థ్యాన్ని మరింతగా పెంచాలని అధికారులను ఆదేశించారు.  

గతంలో వచ్చిన ఇతర వైరస్​లతో పోల్చితే కొవిడ్​-19 వైరస్​లో మరణాల రేటు అతి తక్కువగా ఉంటుందని తెలిపారు. కరోనా వస్తే చనిపోతారన్న ప్రచారంలో  ఏమాత్రం వాస్తవం లేదని అన్నారు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో కొవిడ్​-19 వైద్యానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలను చైతన్యం చేసేలా ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులను ఆదేశించారు.  

                హైదరాబాద్​తో పాటు రాష్ట్రంలోని పురపాలికల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కొవిడ్​-19 సమస్యపై అసత్యాలను ప్రచారం చేసే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:3 వేలు దాటిన కరోనా మరణాలు- మరిన్ని దేశాలకు విస్తరణ

Last Updated : Mar 3, 2020, 12:50 PM IST

ABOUT THE AUTHOR

...view details