కాసేపట్లో మంత్రివర్గ సమావేశం.. లాక్డౌన్పై కీలక నిర్ణయం - ts cabinet latest news
13:20 May 05
కాసేపట్లో మంత్రివర్గ సమావేశం.. లాక్డౌన్పై కీలక నిర్ణయం
కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. మంత్రులు, ఉన్నతాధికారులు ప్రగతిభవన్ చేరుకుంటున్నారు. భేటీలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్రం ఇచ్చిన సడలింపులపై చర్చిస్తారు. కరోనా మహమ్మారి కట్టడి, విద్యార్థులకు పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మద్యం దుకాణాలకు అనుమతులపైనా మంత్రివర్గ భేటీలో చర్చించే అవకాశం ఉంది. వైద్యారోగ్య శాఖ నివేదికపైనా సమాలోచనలు చేస్తారు. రాజధాని, చుట్టుపక్కల జిల్లాల్లో సడలింపులు వద్దన్న వైద్య శాఖ నివేదికపై చర్చిస్తారు. సమగ్ర వ్యవసాయ విధానం, నీటిపారుదల అంశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గంలో సమాలోచనలు చేస్తారు.
ఇవీ చూడండి: వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సీఎం సమీక్ష