ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు మృతి పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని మనసారా ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. కరీంనగర్ రాజకీయాల్లో రత్నాకర్ రావు చెరగని ముద్ర వేశారన్నారు.
మాజీ మంత్రి జువ్వాడి మృతికి బండి సంజయ్ సంతాపం - Ex Minister Juvvadi Bandi Sanjay
మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు మృతి పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పారు. కరీంనగర్ రాజకీయాల్లో రత్నాకర్‌రావు చెరగని ముద్ర వేశారన్నారు.

బండి సంజయ్
రాజకీయాల్లో జువ్వాడి నిబద్ధత కలిగిన నాయకుడని... ఆయన నీతికి, నిజాయతీకి మారుపేరుగా నిలిచారని సంజయ్ తెలిపారు. అనేక మంది కార్యకర్తలకు మార్గదర్శకులుగా నిలిచి... ప్రజాసేవకే అంకితమయ్యారని కొనియాడారు. కొద్ది నెలల క్రితమే ఆయనను కలిసి ఆశీర్వాదం తీసుకున్న సందర్భం ఇంకా తన కళ్ల ముందే కదులుతుందని చెప్పారు.
ఇదీ చదవండి:ఆ ఒక్క రాష్ట్రంలోనే లక్ష లాక్డౌన్ ఉల్లంఘన కేసులు!