తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు ఎల్బీస్టేడియంలో బీఎస్పీ- జనసేన బహిరంగ సభ - BSP-JANASENA Meeting At LB Satdium

పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ, జనసేన పార్టీలు సంయుక్తంగా పోటీ చేస్తున్నాయి. దీనిలో భాగంగా రెండు పార్టీలకు చెందిన నాయకులు హైదరాబాద్​ ఎల్బీస్టేడియంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు.

రేపు ఎల్బీస్టేడియంలో బీఎస్పీ- జనసేన బహిరంగ సభ

By

Published : Apr 3, 2019, 4:49 PM IST

Updated : Apr 3, 2019, 8:41 PM IST

రేపు ఎల్బీస్టేడియంలో బీఎస్పీ- జనసేన బహిరంగ సభ
రేపు హైదరాబాద్​ ఎల్బీ స్టేడియంలో బీఎస్పీ, జనసేన పార్టీలు సంయుక్తంగా బహిరంగ సభను నిర్వహించబోతున్నాయి. ఈ సభకు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరుకానున్నారని ఆయా పార్టీల నేతలు వెల్లడించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ జనసేన అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్​కు మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు. సభ ఏర్పాట్లను రెండు పార్టీలకు చెందిన నాయకులు పరిశీలించారు.

తెలంగాణలో తాము 12 స్థానాల్లో పోటీ

తెలంగాణలో తాము 12 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ తమ పొత్తు కొనసాగుతుందన్నారు. తెలంగాణలో తెరాస పార్టీ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని బీఎస్పీ నేతలు విమర్శించారు.

ఇవీ చూడండి:సీఎంను ప్రకటించిన కౌన్సిలర్​... అవాక్కైన మంత్రి..!

Last Updated : Apr 3, 2019, 8:41 PM IST

ABOUT THE AUTHOR

...view details