హిమాలయాల్లో కనిపించే అరుదైన బ్రహ్మాకమలాలు హైదరాబాద్‌లో దర్శనమిచ్చాయి. హిమాయత్‌నగర్‌లోని ప్రజాపిత బ్రహ్మకుమారి భవన్లో రెండు బ్రహ్మకమలాలు వికసించాయి. ఆ పుష్పాలకు హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఏడాది క్రితం ఈ చెట్టును భవనంలో నాట్టినట్లు బ్రహ్మకుమారీలు తెలిపారు. హిమాలయాల్లో ఎక్కువగా కనిపించే ఈ పుష్పాలు శీతల ప్రదేశాల్లో మాత్రమే పూస్తాయని... శివునికి ఈ కమలాలంటే చాలా ఇష్టమని తెలిపారు.
భాగ్యనగరంలో శివునికి ఇష్టమైన బ్రహ్మకమలాలు - Brahma Kamalalu In BrahmaKumaris Center at himayathnagar
శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన అరుదైన బ్రహ్మకమలాలు హిమాలయాల్లోనే కాదు... మన భాగ్యనగరంలోనూ దర్శనమిచ్చాయి. హిమాయత్‌నగర్‌లోని ప్రజాపిత బ్రహ్మకుమారి భవన్లో రెండు కమలాలు వికసించి కనువిందు చేస్తున్నాయి.
Brahma Kamalalu In BrahmaKumaris Center at himayathnagar