హైదరాబాద్ మలక్‌పేట్ నియోజకవర్గంలోని భారత జనతా పార్టీ నాయకుల పిలుపుతో ముసారాంబాగ్ డివిజన్‌లో పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టారు. డివిజన్ అధ్యక్షులు విజయ్ కాంత్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరుబాటను ఈరోజు నిర్వహించారు. ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో జీహెచ్ఎంసీ పార్క్, డ్రైనేజీ నిర్మించాలని డిమాండ్ చేశారు.
ముసారాంబాగ్‌లో ప్రజా సమస్యలపై భాజపా పోరుబాట - హైదరాబాద్‌లో పోరుబాట కార్యక్రమం
హైదరాబాద్ ముసారాంబాగ్ డివిజన్ పరిధిలో భాజపా పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టింది. స్థానిక నాయకులు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో జీహెచ్ఎంసీ పార్క్, డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లో ప్రజా సమస్యలపై భాజపా పోరుబాట
ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని... తెరాస ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ కార్యక్రమంలో భాజపా మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.