ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలంటూ హైదరాబాద్లోని అబిడ్స్ కలెక్టరేట్ కార్యాలయం ముందు భాజపా ఎస్సీ మోర్చా నాయకులు ఆందోళనకు దిగారు. కలెక్టర్ బయటకు రాకపోవటంతో గేటు లోపలికి వెళ్లేందుకు నాయకులు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి విషమించటంతో ఎమ్మెల్సీ రాంచందర్ రావుతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
భాజపా ఎస్సీ మోర్చా నాయకులు ఆందోళన.. అరెస్ట్ - తెలంగాణ వార్తలు
ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలంటూ కలెక్టరేట్ ముందు భాజపా ఎస్సీ మోర్చా నాయకులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కార్యాలయం గేటు లోపలికి వెళ్లేందుకు నిరసనకారులు యత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు.

భాజపా ఎస్సీ మోర్చా నాయకులు ఆందోళన.. అరెస్ట్
ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలిస్తూ... ఎస్సీలను మోసం చేస్తున్నారని వారు ఆరోపించారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు, ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తామని ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. ఎటువంటి షరతులు లేకుండా ఎస్సీ కార్పొరేషన్ నిధులను మంజూరు చేయాలని.. లేనిపక్షంలో తెరాస పార్టీకి దళితులు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
ఇదీ చూడండి:పండ్లు కొన్నాడు.. పైసలు అడిగితే చంపేశాడు!