Bandi Sanjay Fires on CM KCR : భారతీయ జనతా పార్టీ తెలంగాణ కార్యవర్గ సమావేశాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో సింగల్‌గా పోటీ చేస్తామని.. అధికారం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్కు వేసినట్లే..:కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్‌కు కేసీఆర్ నిధులు సమకూర్చారని బండి సంజయ్ ఆరోపించారు. కర్ణాటక ఎన్నికలకు, తెలంగాణ ఎన్నికలకు సంబంధం లేదన్న ఆయన.. అక్కడ బీజేపీ ఓటు శాతం తగ్గలేదని పేర్కొన్నారు. జేడీఎస్ ఓట్లను బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్‌కు మళ్లించారని తెలిపారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడులో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా దక్కలేదని ధ్వజమెత్తారు. అలాంటిది బీఆర్ఎస్కు.. కాంగ్రెస్ ఏ విధంగా ప్రత్యామ్నాయం అవుతుందని బండి ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్కు వేసినట్లేనని బండి సంజయ్ పునరుద్ఘాటించారు.
'బీజేపీ ఎదుగుదలను ఓర్వలేకే కేసీఆర్ కాంగ్రెస్‌ను పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని గెలిచింది. నిజామాబాద్, కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని గెలిచింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు సాధించింది. మునుగోడులో కాంగ్రెస్ తరఫున బీఆర్ఎస్ డబ్బులు పంచింది. కాంగ్రెస్‌పై ప్రజల్లో విశ్వాసం లేకుండా పోయింది. కుటుంబ పాలన వల్ల రాష్ట్రంలో అభివృద్ది జరగట్లేదు.'-బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు