తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi sanjay tweet: 'ఈడీ విచారణ అనగానే ట్విటర్ టిల్లుకు భయం పట్టుకుంది'

Bandi sanjay tweet: ప్రధానమంత్రికి ట్యాగ్ చేస్తూ ట్విటర్​లో కేటీఆర్ చేసిన వ్యంగ ఆరోపణలపై బండి సంజయ్ స్పందించారు. వీటిపై బండి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్​ను ట్విటర్ టిల్లుగా అభివర్ణిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఈడీ విచారణ అనగానే ట్విటర్ టిల్లుకు భయం పట్టుకుందంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.

బండి సంజయ్
బండి సంజయ్

By

Published : Jul 22, 2022, 7:53 PM IST

Bandi sanjay tweet: ప్రధానమంత్రికి ట్యాగ్ చేస్తూ కేటీఆర్ చేసిన ట్వీట్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్​ను ట్విటర్ టిల్లుగా అభివర్ణిస్తూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. ఈడీ విచారణ అనగానే ట్విటర్ టిల్లుకు భయం పట్టుకుందంటూ ఎద్దేవా చేశారు. ఆందోళన ఎక్కువైతే యోగా చేయడం మంచిదని హితవు పలికారు. దర్యాప్తు సంస్థలు తలుపు తట్టే వరకు ఊపిరి పీల్చుకోమన్నారు.

అసలేం జరిగిదంటే:ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ అధినేతగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను నియమించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు అంటూ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం, భాజపాపై కేటీఆర్ పలు అంశాలపై ట్విటర్​లో తనదైన శైలిలో స్పందించారు. కేసీఆర్ కూడా ఈడీ, సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధానిని ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

దేశంలో ఉన్న డబుల్ ఇంజిన్ అంటే మోదీ, ఈడీ అని అర్థమైందని వ్యాఖ్యానించారు. అటు ఆదాని అంశంపైనా కేటీఆర్ స్పందించారు. ప్రపంచ పేదరిక రాజధానిగా భారతదేశం.. నైజీరియాను అధిగమించిందని తెలిపారు. ఇదే సమయంలో అదాని.. బిల్​గేట్స్‌ను దాటి మరీ ప్రపంచంలోనే నాలుగో ధనవంతుడయ్యారని పేర్కొన్నారు. ఇవి దేశానికి సంబంధించి రెండు కఠోర వాస్తవాలు అని అన్నారు.

ఇవీ చదవండి:మోదీజీ థ్యాంక్స్.. ఈడీ చీఫ్​గా బండిని నియమించినందుకు..: కేటీఆర్

భూమి కోసం ఒకరు.. భాష కోసం మరొకరు.. ఇద్దరు వృద్ధుల వినూత్న నిరసన

ABOUT THE AUTHOR

...view details