తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యులు నిజమైన హీరోలు: బండారు దత్తాత్రేయ

ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్యులు నిజమైన హీరోలని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కొనియాడారు. సిమ్లాలోని రాజ్‌ భవన్‌లో జరిగిన జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వైద్యులు నిజమైన హీరోలు: బండారు దత్తాత్రేయ
వైద్యులు నిజమైన హీరోలు: బండారు దత్తాత్రేయ

By

Published : Jul 1, 2020, 10:43 PM IST

జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలోని రాజ్ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గొప్ప మేధావి, సేవాభావం కలిగిన వైద్యుడు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ (పశ్చిమ్ బంగా రెండో ముఖ్యమంత్రి) జన్మదినం సందర్భంగా జులై 1న ఈ దినోత్సవం జరుపుకుంటారని ఆయన తెలిపారు.

ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్యులు నిజమైన హీరోలని దత్తాత్రేయ కొనియాడారు. ప్రపంచం ఎదుర్కొంటున్న క్లిష్ట సమయంలో వైద్యులను భగవంతునిగా గుర్తిస్తున్నామన్నారు. ఉత్తమమైన వృత్తి చేపట్టి మానవజాతికి నిరంతర సేవలందిస్తున్న వైద్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్‌ కిక్కు.. ఒక్కరోజే డబుల్

ABOUT THE AUTHOR

...view details