ఈఎస్ఐ స్కాంలో డాక్టర్ ఆడియో టేపు సంచలనం - esi scam audio tape
ఈఎస్ఐ స్కాం లో రోజుకో కొత్త విషయం బయట పడతోంది. ఇప్పటికే ఏడుగురు నిందితులను ఏసీబీ అరెస్ట్ చేసింది. అయితే తాజాగా బయటకు వచ్చిన ఆడియో టేపు సంచలన సృష్టిస్తోంది.
ఈఎస్ఐ కుంభకోణంలో రోజుకో కొత్త అంశం బయటపడుతోంది. ఇప్పటికే ఏడుగుర్ని అరెస్టు చేసిన ఏసీబీకి తాజాగా ఆడియో టేపుల ఆధారాలు లభించాయి. తప్పుడు బిల్లులు పెట్టాలంటూ సెక్షన్ ఆఫీసర్ సురేంద్రనాథ్ ఈఎస్ఐ డాక్టర్లను ఒత్తిడి చేసిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో టేపు బయటకు వచ్చింది. 50 లక్షల రూపాయలకు తప్పుడు బిల్లులు తయారుచేసి పంపించాలని, క్యాంపు పేరుతో మెడిసిన్ పంపించినట్లు రాసుకొని రికార్డు సృష్టించాలని ఈఎస్ఐ డాక్టర్ సురేంద్రనాథ్ చెప్పడం ఆడియో టేపుల్లో స్పష్టంగా ఉంది. అయితే డాక్టర్ ఒప్పుకోకపోవడంతో ఆ అధికారి బెదిరింపులకు పాల్పడ్డారు. మరొక మహిళా అధికారికి ఫోన్ చేసి బెదిరించిన సురేంద్ర...డైరెక్టర్ బిల్లులు అడుగుతున్నారని...సంవత్సరం తర్వాత క్యాంప్ నిర్వహించినట్లు బిల్స్ తయారు చేయాలని ఆమె పై ఒత్తిడి తీసుకువచ్చాడు. అయితే ఏడాది తరువాత బిల్స్ తయారు చేయలేనని ఆ డాక్టర్ కరాఖండిగా చెప్పారు.
- ఇదీ చూడండి : ఈఎస్ఐ స్కామ్లో ఏసీబీ దూకుడు.. ఏడుగురి అరెస్టు
TAGGED:
esi scam audio tape