హైదరాబాద్‌లో 127 మందికి ఆధార్ సంస్థ నోటీసులివ్వడంపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. నోటీసులు అందుకున్న వారిలో ఎస్సీ, ఎస్టీలు ఎవరో, ముస్లింలు ఎవరో డీజీపీ వివరణ ఇవ్వాలని ఒవైసీ డిమాండ్ చేశారు. నిర్బంధ తనిఖీల్లో పోలీసులకు ఆధార్ కార్డు అడిగే హక్కు లేదంటూ ఆయన ట్వీట్ చేశారు.
నిర్బంధ తనిఖీల్లో ఆధార్ అడిగే హక్కు లేదు: అసద్ - udai
హైదరాబాద్‌లో 127 మందికి ఆధార్ సంస్థ నోటీసులివ్వడంపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ స్పందించారు. నిర్బంధ తనిఖీల్లో పోలీసులకు ఆధార్ కార్డు అడిగే హక్కు లేదంటూ ఆయన ట్వీట్ చేశారు.

అసదుద్దీన్
గతేడాది భవానీనగర్ ప్రాంతంలో మీసేవా కేంద్రంలో నకిలీ ఆధార్ కార్డులు తయారు చేస్తున్న ఏజెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో కేసు కూడా నమోదయింది. సదరు ఏజెంట్ ద్వారా కార్డులు పొందిన వారికి... ఆధార్ ఏ విధంగా పొందారు, ఇందుకు సంబంధించిన పత్రాలు సమర్పించాలంటూ ఆధార్ సంస్థ 127 మందికి నోటీసులు జారీ చేసింది.