''అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధితో పాటు అమరావతిని ఏకైక రాజధానిగా కోరుకుంటున్నారా..?'' అన్న ప్రశ్నకు... అమరావతికి ఏపీ ప్రజల నుంచి మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. 94 శాతం మంది అమరావతే ఏకైక రాజధాని కావాలని తమ ఓటుతో స్పష్టం చేశారు. రెండురోజుల వ్యవధిలో దాదాపు మూడున్నర లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి ఓటింగ్లో పాల్గొన్నారు.
"ఏకైక రాజధాని అమరావతి"కి ఆన్లైన్లో 94 శాతం ఓటింగ్
అన్ని ప్రాంతాల అభివృద్ధితో పాటు అమరావతి ఏకైక రాజధాని అన్న ప్రశ్నకు... ప్రజల నుంచి భారీ ఎత్తున మద్దతు లభిస్తుంది. 94 శాతం మంది అమరావతి రాజధాని కావాలని తమ ఓటుతో స్పష్టం చేశారు. తెలుగు దేశం అధినేత చంద్రబాబు ఏపీవిత్ అమరావతి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ఓటింగ్ అందుబాటులోకి తీసువచ్చారు.
"ఏకైక రాజధాని అమరావతి"కి ఆన్లైన్లో 94 శాతం ఓటింగ్
తెలుగుదేశం అధినేత చంద్రబాబు www.apwithamaravati.com వెబ్ సైట్ ద్వారా ఈ ఆన్ లైన్ ఓటింగ్ విధానాన్ని ఈ నెల 24న అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ప్రజాభిప్రాయం కోరుదామని తాను విసిరిన సవాల్ ను ప్రభుత్వం స్వీకరించకపోవడంతో ఆన్లైన్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు.
ఇదీ చదవండి :సీబీఐ అధికారులపై మహిళా ఎస్సై గూఢచర్యం!