రాష్ట్రంలో కొత్తగా 101 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,95,682కు చేరింది. తాజాగా కొవిడ్‌తో ఒకరు మృతి చెందాగా.. మొత్తం మృతుల సంఖ్య 1,611కి పెరిగింది. వైరస్ నుంచి మరో 197 మంది కోలుకున్నారు. వీరితో కలిపి కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,92,229కి చేరింది.
రాష్ట్రంలో మరో 101 కరోనా కేసులు.. ఒకరు మృతి
తెలంగాణలో మరో 101 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా వైరస్‌తో ఒకరు చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 1,611కి చేరింది.
రాష్ట్రంలో మరో 101 కరోనా కేసులు.. ఒకరు మృతి
తెలంగాణలో ప్రస్తుతం 1,842 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 751 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 24 కరోనా కేసులు రాగా... మిగిలిన కేసులు జిల్లాల్లో నమోదయ్యాయి.
ఇదీ చదవండి:దేశంలో 1.55 లక్షలు దాటిన కరోనా మరణాలు