తెలంగాణ

telangana

ETV Bharat / state

'సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం' - డాక్టర్​ ఖాదర్​ వలి

మంచి ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని స్వతంత్ర శాస్త్రవేత్త  ఖాదర్ వలీ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలంలోని ప్రగతి రిసార్ట్​లో అమృతాహారం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

amrutaharam special program in rangareddy pragati resorts
'సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం'

By

Published : Jan 6, 2020, 3:14 PM IST

మంచి ఆహారం తీసుకోవడమే సగం ఆరోగ్యాన్ని పొందడం అని స్వతంత్ర శాస్త్రవేత్త ఖాదర్ వలీ అన్నారు. ప్రకృతిలో ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఉండగా మనం మాత్రం బియ్యం గోధుమలతోనే సరిపెట్టుకుంటున్నామన్నారు. రంగారెడ్డి జిల్లాలోని శంకర్​పల్లి ప్రగతి రిసార్ట్స్​లో జరిగిగిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజర్యయారు. తినే ఆహారంలో మార్పు చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్య స్థితిని పొందవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సిరిధాన్యాలే మనుషులకు అసలైన ఔషధ గుణాలున్న ఆహారమని ఆ చైతన్యం నింపడానికే కృషి చేస్తున్నాని ఖాదర్​ వలీ అన్నారు.

సిరిధాన్యాలు పోషకాలను పుష్కలంగా అందించడమే కాకుండా దేహంలో నుంచి రోగకారకాలను తొలగించి శుద్ధి చేస్తాయన్నారు. ఆరోగ్యసిరినిచ్చే సిరిధాన్యాలే నిజమైన, సహజమైన ఆహారమని ఆయన పేర్కొన్నారు. అనంతరం సమావేశానికి హాజరైన ప్రజలు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ ఖాదర్ వలి సమాధానాలు చెప్పారు.

అమృత ఆహారంతో అన్ని రోగాలు దూరమవుతాయని ప్రగతి రిసార్ట్స్ సీఎండీ డాక్టర్ జీబీకే రావు అన్నారు. నేడు కొత్త కొత్త రోగాలు మనల్ని బాధపెడుతున్నాయంటే కారణం మనం తీసుకునే ఆహారమేనని రావు పేర్కొన్నారు. చిరుధాన్యాలు, కాషాయాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని అదే అమృతాహారం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఐఆర్డీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డబ్లూఆర్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా రైతునేస్తం ఎడిటర్ వెంకటేశ్వర రావు హాజరయ్యారు.

'సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం'

ఇదీచూడండి.'ఈటీవీ భారత్'ను సందర్శించిన సూపర్​స్టార్ రజనీ

ABOUT THE AUTHOR

...view details