ఏపీలోని గుంటూరు జిల్లా మందడంలో అమరావతి రైతులు వినూత్న నిరసన చేపట్టారు. ఆ రాష్ట్ర సీఎం సచివాలయానికి వెళ్లే సమయంలో పోలీసులు తమను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ... మాక్ మంత్రి మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలకపూడి శ్రీనివాస్ ముఖ్యమంత్రిగా... ఇతర రైతులు మంత్రులుగా నటించారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు చేయడం తప్ప మంత్రులుగా తాము సొంత నిర్ణయాలు తీసుకోలేమనే విషయాలు తెలిసేలా వినూత్న ప్రదర్శన నిర్వహించారు.
వినూత్న నిరసన: అమరావతి రైతుల 'మాక్ మంత్రి మండలి' భేటీ - అమరావతి రైతుల 'మాక్ మంత్రి మండలి' సమావేశం
ఆంధ్రప్రదేశ్లోని అమరావతి రైతులు వినూత్న నిరసన చేపట్టారు. సీఎం సచివాలయానికి వెళ్లే సమయంలో తమను అడ్డుకోవటాన్ని నిరసిస్తూ.. మందడంలో మాక్ మంత్రి మండలి సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు చేయడం తప్ప మంత్రులుగా తాము సొంత నిర్ణయాలు తీసుకోలేమనే విషయాలు తెలిసేలా వినూత్న ప్రదర్శన చేపట్టారు.

ఏపీలో వినూత్న నిరసన: అమరావతి రైతుల 'మాక్ మంత్రి మండలి' భేటీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్... సచివాలయం నుంచి తాడేపల్లి వెళ్లే సమయంలోనూ పోలీసులు దీక్షా శిబిరం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దించారు. పోలీసుల తీరును నిరసిస్తూ రైతులు అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.
ఇదీ చూడండి:ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.. దళారులను నమ్మొద్దు: పువ్వాడ