తెలంగాణ

telangana

By

Published : Nov 10, 2020, 10:21 AM IST

ETV Bharat / state

మోదీ సర్కార్ కార్మికుల హక్కులను కాలరాస్తోంది : ఏఐటీయూసీ

కేంద్ర ప్రభుత్వం.. కార్పొరేట్ సంస్థలకు లొంగిపోయి, కార్మిక చట్టాలను సమూలంగా మార్పులు చేస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్​రాజ్ ఆరోపించారు. మోదీ సర్కార్ కార్మికుల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. ఈనెల 26న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిస్తూ హైదరాబాద్ హిమాయత్ నగర్​లోని రాష్ట్ర కార్యాలయంలో సమ్మె గోడపత్రికను ఆవిష్కరించారు.

AITUC strike against central government
ఏఐటీయూసీ

మోదీ ప్రభుత్వం కార్మిక సంక్షేమ పథకాలను ఎత్తివేసి వారి భవిష్యత్​ను అంధకారం చేస్తోందని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బోస్ ఆరోపించారు. ఆరేళ్లలో ఎన్డీఏ సర్కార్ అవలంబించిన కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక చర్యలను నిరసిస్తూ, కార్పొరేట్ విధానాలను ఖండిస్తూ నవంబర్ 26న దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు.

సమ్మెకు సంబంధించిన గోడపత్రికను హైదరాబాద్​లోని రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. దేశంలోని పారిశ్రామిక కార్మికులు, రైతులు, ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనాలని కోరారు. సామాన్యులకు విద్యను దూరం చేసేందుకు మరో కుట్రకు మోదీ సర్కార్ ప్రణాళికలు రచిస్తోందని ఏఐటీయూసీ అధ్యక్షుడు బాల్​రాజ్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details