హైదరాబాద్ నగరంలోని అల్వాల్ పరిధిలో శుక్రవారం 252 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 72 మందికి పాజిటివ్‌గా తేలింది. స్థానిక పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 40 మంది టీఎన్‌ఎస్‌పీ సిబ్బందిలో 31 మంది కరోనా బారినపడ్డారు. పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.
టీఎన్‌ఎస్‌పీ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రత్యేక ఫోర్స్‌గా పనిచేస్తారని... వీవీఐపీ బందోబస్తు, పండుగలు, ఇతర అవసరాలకు ఈ సిబ్బందిని వినియోగిస్తారని అల్వాల్ ఎస్తై పులి యాదగిరి తెలిపారు. కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ పోలీసులు మహమ్మారి బారినపడడం బాధాకరమన్నారు.