రాష్ట్రవ్యాప్తంగా కరోనా నిర్ధరణ పరీక్షలు గణనీయంగా పెరిగాయి. తాజాగా 1,07,677 మందికి పరీక్షలు నిర్వహించగా.. అందులో 2,982 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. మరో 1,381 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది.
రాష్ట్రంలో కొత్తగా 2,982 కరోనా కేసులు, 21 మరణాలు - telangana latest news

19:35 May 29
రాష్ట్రంలో కొత్తగా 2,982 కరోనా కేసులు, 21 మరణాలు
తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,74,026 మందికి వైరస్ సోకింది. మరో 3,837 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 5,33,862 మంది సురక్షితంగా బయటపడ్డారు. తాజాగా మరో 21 మంది వైరస్‌కు బలికాగా.. మరణాలు 3,247కు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 36,917 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 436, ఆదిలాబాద్ 12, భద్రాద్రి కొత్తగూడెం 118, జగిత్యాల 58, జనగామ 36, జయశంకర్ భూపాలపల్లి 49, జోగులాంబ గద్వాల 38, కామారెడ్డి 16, కరీంనగర్ 143, ఖమ్మం 176, ఆసిఫాబాద్ 28, మహబూబ్‌నగర్ 101, మహబూబాబాద్ 115, మంచిర్యాల 95, మెదక్ 37, మేడ్చల్ మల్కాజిగిరి 153, ములుగు 43, నాగర్‌కర్నూల్ 60, నల్గొండ 190, నారాయణపేట 19, నిర్మల్ 13, నిజామాబాద్ 47, పెద్దపల్లి 129, రాజన్న సిరిసిల్ల 56, రంగారెడ్డి 174, సంగారెడ్డి 66, సిద్దిపేట 109, సూర్యాపేట 117, వికారాబాద్ 72, వనపర్తి 73, వరంగల్ రూరల్ 79, వరంగల్ అర్బన్ 87, యాదాద్రి భువనగిరిలో 37 చొప్పున కేసులు వెలుగు చూశాయి.
ఇదీ చూడండి: lockdown: రాష్ట్రంలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమలు