తెలంగాణ

telangana

ETV Bharat / state

వైఖరి మార్చిన ట్రావన్​కోర్ దేవస్థాన మండలి

శబరిమలలో అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతించాలని సుప్రీం కోర్టుకు ట్రావన్​కోర్ దేవస్థానం బోర్డు సూచించింది.

శబరిమల ఆలయం

By

Published : Feb 7, 2019, 8:06 AM IST

శబరిమల ఆలయం
శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు తీర్పుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) మద్దతు ప్రకటించింది. అయితే నిర్ణయం వెనక వామపక్ష ప్రభుత్వ ఒత్తిడి లేదని టీడీబీ స్పష్టం చేసింది. గతంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా బోర్డు ప్రవర్తించింది.

"బోర్డు నిర్ణయంపై ఎలాంటి ప్రభుత్వ ఒత్తిడి లేదు. మేం సాధారణంగానే కోర్టు తీర్పును ఆహ్వానించాం. అయితే తీర్పును అమలు చేసేందుకు కొంత సమయం కోరాం."
-ఎ.పద్మకుమార్, టీడీబీ అధ్యక్షుడు

పునః​దర్శనమే బహిష్కరణకు పరిష్కారం: సుప్రీం

కనకదుర్గ, బిందు

శబరిమల ఆలయంలోకి ప్రవేశించి సామాజిక బహిష్కరణ ఎదుర్కొంటున్న మహిళలు బిందు, కనకదుర్గలకు పునఃదర్శనం కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అదే వారి సమస్యకు పరిష్కారమని కోర్టు పేర్కొంది. ఆలయం తిరిగి ప్రారంభమయ్యే ఫిబ్రవరి 12న ఆదేశాలను అమలు చేయాలని న్యాయస్థానం సూచించింది.

ABOUT THE AUTHOR

...view details