ప్రాదేశిక ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. 2,096 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. 217 చోట్ల... సాయంత్రం 4 గంటల వరకు, 1880 ఎంపీటీసీ స్థానాలకు 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎంపీటీసీ కోసం గులాబీ, జడ్పీటీసీకి తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలు వినియోగిస్తున్నారు. కేంద్రాల్లోకి నీళ్ల సీసాలు, ఇంకు, అగ్గిపెట్టెలు వంటి అభ్యంతరకరమైన వస్తువులకు అనుమతి నిరాకరించింది రాష్ట్ర ఎన్నికల సంఘం.
కొనసాగుతున్న స్థానిక సంస్థల తొలి విడత పోలింగ్ - undefined
స్థానిక సంస్థల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం నుంచే ఓటర్లు కేంద్రాల వద్ద క్యూ కట్టారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు, మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

స్థానిక సంస్థల తొలి విడత పోలింగ్ ప్రారంభం
Last Updated : May 6, 2019, 10:17 AM IST
TAGGED:
polling start