పనితీరే కొలమానం
గ్రేటర్‌పై కేటీఆర్ నజర్... కారణాలివే!
గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణకు తలమానికం. ఇక్కడి గెలుపు అందరికీ ప్రతిష్ఠాత్మకమే. పైగా తెరాస తరఫున పోటీ చేసేది కొత్త అభ్యర్థులు. నేతలు, కార్పొరేటర్ల మధ్య సమన్వయం లోపం, ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి సభపై రకరకాల ప్రచారాలతో పార్టీలో కలవరం మొదలైంది. అప్రమత్తమైన కేటీఆర్... ఈ మూడు స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
గ్రేటర్ పరిధిలో నేతల మధ్య సమన్వయం లోపం, శ్రేణుల నిర్లక్ష్య వైఖరితో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. చాపకింద నీరులా చేస్తున్న ప్రత్యర్థుల ప్రచారంతో... తెరాస నాయకత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఎల్బీ స్టేడియం సభ జరిగిన తీరుతో అసంతృప్తికి గురైన అధిష్ఠానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పూర్తిగా గ్రేటర్పైనే దృష్టి పెట్టిన యువనేత... జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. గ్రేటర్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపునకు సార్వత్రిక సమరం పనితీరే గీటురాయి అని, నిర్లక్ష్యం వీడి సమష్టిగా పనిచేయాలని తేల్చి చెప్పారు. ఈనెల 8న వికారాబాద్ సభకు కేసీఆర్ హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఇవీ చూడండి:హైదరాబాద్‌లో మజ్లిస్‌ను ఢీకొట్టేదెవరు ?