వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు - JUSTIS
తన భూమిని కొంత మంది కబ్జా చేశారని... తనకు న్యాయం చేయాలంటూ ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెంలోని రైల్వేకాలనీలో చోటుచేసుకుంది.
వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు
భద్రాద్రి కొత్తగూడెంలోని రైల్వేకాలనీలో ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కాడు. పాల్వంచలో తన భూమిని కబ్జా చేశారని.. గత నాలుగు సంవత్సరాలుగా అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ వాటర్ ట్యాంక్ ఎక్కాడు. యువకుడు పాల్వంచ కిన్నెరసానికి చెందిన గౌతమ్‌గా గుర్తించారు.