పనులు ఆపేసి ఆందోళన చేసిన రైతులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పనులు జరిగేందుకు సహకరించాలని కోరారు. తాము కోరిన విధంగా పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. చేసేదేమీలేక రైతులను పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించగా.. ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు, రైతులకు మధ్య పరస్పర తోపులాట జరిగింది. ఈ క్రమంలో ముగ్గురు రైతులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.
సరైన పరిహారం ఇస్తేనే భూములిస్తాం.. జెన్కో రైల్వే లైన్‌పై రైతుల ఆందోళన - రామానుజవరంలో ఉద్రిక్తత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జెన్కో సంస్థ ఏర్పాటు చేస్తున్న రైలు మార్గపు పనులను రైతులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. తమకు న్యాయమైన పరిహారం ఇచ్చాకే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Tension in Ramanujavaram and police arrested farmers
రైతులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ నాయకులు మద్దతు పలికారు. అరెస్ట్ చేసిన వారిని వాహనాల్లో తరలించకుండా పోలీసులకు అడ్డుపడ్డారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నాయకులను కూడా.. పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చూడండి:
Last Updated : Mar 5, 2022, 4:12 PM IST