‘స్వచ్ఛత మహా’ కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణానికి కృషిచేయాలని ఇల్లందు ఏరియా జీఎం సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు పరిసరాలను శుభ్రపరచుకోవడం తమ బాధ్యతగా భావించాలని కోరారు. ఇంటిలోని చెత్తను బయట వేయకూడదని సూచించారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని సింగరేణి సంస్థలో అక్టోబర్ 1 నుంచి 31వ వరకు స్వచ్ఛత మహా కార్యక్రమాన్ని చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం జేకే కాలనీలో నిర్వహించారు.
'ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి' - భద్రాద్రి కొత్తగూడెంలో స్వచ్ఛత మహా కార్యక్రమం
మహాత్మగాంధీ జయంతిని పురస్కరించుకొని సింగరేణి సంస్థలో నెల రోజుల పాటు స్వచ్ఛత మహా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంతో ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలని ఇల్లందు ఏరియా జీఎం సత్యనారాయణ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని కోరారు.

'ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి'
కాలనీల్లోని పరిసరాలను అధికారులు పరిశీలించారు. స్థానికంగా ఉన్న చెత్తను సిబ్బందితో కలసి ట్రాక్టర్ లో వేశారు. ఈ కార్యక్రమoలో అధికారులు, ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
TAGGED:
సింగరేణి లేటెస్ట్ న్యూస్