చిత్తా నక్షత్రం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో సుదర్శన హోమం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ సమేత సీతారాములు బంగారు కవచాలతో భక్తులకు దర్శనమిస్తున్నారు. సాయంత్రం స్వామివారికి సంధ్యా హారతి ఉత్సవం నిర్వహించనున్నారు.
చిత్తా నక్షత్రం సందర్భంగా రామయ్యకు ప్రత్యేక పూజలు - latest news on badradri ramayya
చిత్తా నక్షత్రాన్ని పురస్కరించుకొని భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

చిత్తా నక్షత్రం సందర్భంగా రామయ్యకు ప్రత్యేక పూజలు
మరోవైపు ఉపాలయంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం మహిళా భక్తులచే శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామావళి పారాయణం నిర్వహించనున్నారు.
చిత్తా నక్షత్రం సందర్భంగా రామయ్యకు ప్రత్యేక పూజలు