తెలంగాణ

telangana

ETV Bharat / state

మాకు బస్సులు ఏర్పాటు చేయండి: సింగరేణి కార్మికులు

కరోనా కాలంలో భౌతిక దూరం పాటిస్తూ విధులకు హాజరయ్యేలా బస్సులు ఏర్పాటు చేయాలని కోయగూడెం ఉపరితల గనుల్లో పనిచేసే కార్మిక సంఘం నాయకుల నిరసన చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి కార్మికులు అన్ని షిఫ్టుల్లో విధులకు హాజరయ్యేలా తమకు వసతులు కల్పించాలని కోరారు.

singareni workers protest at illandu in bhadradri kothagudem
మాకు బస్సులు ఏర్పాటు చేయండి: సింగరేణి కార్మికులు

By

Published : Jul 15, 2020, 4:07 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి కోయగూడెం ఉపరితల బొగ్గు గనులకు వెళ్లే వారికి భౌతికదూరం పాటిస్తూ విధులకు హాజరయ్యేలా తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలని కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ నాయకులు, కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేనేజర్ జీవన్ కుమార్​కు వినతి పత్రం అందజేశారు. ఒకవైపు కరోనా విజృంభిస్తోన్న తరుణంలో సింగరేణి కార్మికులు భయాందోళన మధ్య విధులు నిర్వహిస్తున్నారని రవాణా పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్ని షిఫ్టుల కార్మికులు విధులకు హాజరయ్యే విధంగా యాజమాన్యం బస్సులు నడపాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి ఎండీ నజీర్ అహ్మద్, టీబీజీకేఎస్ ఎస్వీఎస్ ఎన్. రాజు, రాంబాబు, కృష్ణ, బాలాజీ, రామారావు, ఖాదర్, వెంకట నర్సయ్య, షబ్బీర్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:భర్త ఇంటి ఎదుట కొడుకుతో కలిసి భార్య నిరసన

ABOUT THE AUTHOR

...view details