ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు బయటకు వస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా నూతన శానిటేషన్ యంత్రాన్ని ప్రారంభించారు.
కొత్తగూడెంలో పర్యటించిన వనమా వెంకటేశ్వరరావు - updated news on mla Vanama Venkateswara Rao toured at the kothagudem in badradri district
కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పర్యటించారు. లాక్డౌన్ దృష్ట్యా ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దని విజ్ఞప్తి చేశారు.

కొత్తగూడెంలో పర్యటించిన వనమా వెంకటేశ్వరరావు
వీధుల్లో స్వయంగా మందును పిచికారీ చేశారు. ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని.. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సిందిగా కోరారు.
కొత్తగూడెంలో పర్యటించిన వనమా వెంకటేశ్వరరావు
ఇదీ చూడండి :మనం ఇంట్లో ఉండటమే వారికిచ్చే బహుమతి